AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్యతో బరిలో దిగడానికి సై అంటున్న స్టార్ హీరో.. ఆయన ఎవరెంటే

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అయితే బాలయ్య కు పోటీగా దళపతి విజయ్ కూడా సంక్రాంతి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

Balakrishna: బాలయ్యతో బరిలో దిగడానికి సై అంటున్న స్టార్ హీరో.. ఆయన ఎవరెంటే
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2023 | 4:23 PM

Share

సంక్రాంతి అంటే బాలయ్య సినిమా పక్కా ఉండాల్సిందే. బరిలో బాలయ్య దిగితే ఆ మజానే వేరు. ఈ ఏడాది బాలకృష్ణ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అయితే బాలయ్య కు పోటీగా దళపతి విజయ్ కూడా సంక్రాంతి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేశాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన సస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య, దళపతి విజయ్ పోటీ పడనున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి అనే టైటిల్ తో తెరెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్, శ్రీలీల ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అటు దళపతి విజయ్ లియో సినిమా  చేస్తున్నారు. లోకేష్ కనగ రాజ్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేష్ ఇప్పుడు లియో సినిమా చేస్తుండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకన్నాయి. ఈ సినిమా కూడా ఆగస్టు 19నే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో మరోసారి బాలకృష్ణ , విజయ్ మధ్య పోటీ జరగనుంది. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరి సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.Leo

Leo