Suriya: సూర్య పుట్టిన రోజు వేడుకలో విషాదం.. కరెంట్ షాక్ తో ఇద్దరు అభిమానులు మృతి
సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. ఇక నేడు సూర్య పుట్టిన రోజు. ఈ వర్సటైల్ హీరో పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు.
తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో సూర్య ఒకరు. సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆయన సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ ఉంటాయి. ఇక నేడు సూర్య పుట్టిన రోజు. ఈ వర్సటైల్ హీరో పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు. అలాగే మనదగ్గర కూడా సూర్య పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూర్య బర్త్ డే వేడుకలో విషాదం నెలకొంది.
సూర్య ఫ్లేక్సీ కడుతూ కరెంట్ షాక్ కు గురై ఓ అభిమాని మరణించాడు. నర్సారావు పేటలోని మొప్పువారిపాలెంలో సూర్య పుట్టిన రోజు సందర్భంగా నక్కా వెంకటేష్, పోలూరి సాయి అనే ఇద్దరు అభిమానులు ఫ్లేక్సీ ఏర్పాటు చేయడనికి ప్రయత్నించారు. ఫ్లేక్సీ కట్టే సమయంలో ఒక్కసారిగా కరెంట్ పాస్ అవ్వడంతో ఇద్దరు షాక్ కు గురయ్యారు.
విద్యుత్ షాక్ తో ఇద్దరూ మృతి చెందినట్టు తెలుస్తోంది. సూర్య అభిమానులు చనిపోవడంతో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు.