AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ‘హనుమాన్‌’ను వీక్షించిన బాలయ్య.. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ గురించి ఏం చెప్పారంటే?

సంక్రాంతి పండగకు విడుదలైన హనుమాన్‌ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో సినిమాకు ఆడియెన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్లు తక్కువగా కేటాయించినప్పటికీ విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్‌ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం.

Balakrishna: 'హనుమాన్‌'ను వీక్షించిన బాలయ్య.. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ గురించి ఏం చెప్పారంటే?
Balakrishna, Hanuman Movie
Basha Shek
|

Updated on: Jan 17, 2024 | 10:47 AM

Share

సంక్రాంతి పండగకు విడుదలైన హనుమాన్‌ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో సినిమాకు ఆడియెన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్లు తక్కువగా కేటాయించినప్పటికీ విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్‌ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం. ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ హనుమాన్ సినిమాను వీక్షించారు. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్య కోసం ‘హనుమాన్’ స్పెషల్ షో ప్రదర్శించారు. హీరో తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. సినిమాను చూసిన బాలయ్య చాలా హ్యాపీగా ఫీలయ్యారట. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మలతో చిత్ర బృందానికి అభినందనలు తెలిపారట.

అన్‌స్టాపబుల్‌తో..

నందమూరి బాలకృష్ణ, ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య మంచి అనుబంధం ఉంది. వీళ్లిద్దరూ గతంలో ఆహా షో కోసం పని చేశారు. బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ప్రోమోలకు ప్రశాంత్ వర్మనే దర్శకత్వం వహించారు. అంతేకాదు షోలోని కొన్ని ఎపిసోడ్స్‌ను కూడా డైరెక్ట్‌ చేశారు. అందుకే హీరో, డైరెక్టర్ల రిక్వెస్ట్‌ మేరకు హనుమాన్ సినిమాను వీక్షించారు బాలయ్య. ఇక కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ హనుమాన్‌ సినిమాను చూశారు. మంగళవారం (జనవరి 16) తన సతీమణి గీతా శివరాజ్ కుమార్ తో కలిసి సినిమా చూశారాయన. అనంతరం తేజ సజ్జా సినిమాపై ప్రశంసలు కురిపించారు శివన్న. అలాగే తన పిల్లలకు కూడా హనుమాన్‌ సినిమాను చూపిస్తానన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి, ఆంజనేయ స్వామికి మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

హనుమాన్ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ..

తేజ సజ్జాతో కన్నడ సూపర్ స్టార్ శివన్న..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.