Balakrishna: బాలయ్య అంటే మినిమం ఉంటది మరి.. ఒక్క సాంగ్ కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట..

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

Balakrishna: బాలయ్య అంటే మినిమం ఉంటది మరి.. ఒక్క సాంగ్ కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 04, 2023 | 8:32 AM

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. వరుసగా హిట్ సినిమాలు తెరకెక్కిస్తూ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో చోటు దక్కించుకున్నారు. యంగ్ హీరోలతో సినిమాలు మొదలుపెట్టి ఇప్పుడు బడా హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మొన్నామధ్య సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమా చేసాడు అనిల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ 90’s బాలయ్యను మరోసారి గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఇక ఈ సినిమానుంచి బయటకు వస్తోన్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ కాళీ మాత భక్తుడిగా కనిపించనున్నారని.. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ యాక్షన్ సీన్స్ గురించి ఒక టాక్ వినిపిస్తోంది. బాలయ్య సినిమాలు అంటేనే యాక్షన్ హైలైట్ గా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అనిల్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం చాలా మంది టెక్నీషన్స్ ను కూడా తీసుకురానున్నారట. ప్రస్తుతం ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుందట. ఈ సాంగ్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ పాటలో బాలకృష్ణతో పాటు శ్రీలీల కూడా కనిపిస్తారని టాక్. ఈ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఈ సాంగ్ ఉండబోతుందని అంటున్నారు.

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో