Director Venu: ఆ కారణంగానే జబర్దస్త్‌ను మానేయాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన ‘బలగం’ డైరెక్టర్‌ వేణు

తన కామెడీ స్కిట్లతో నవ్వుల పువ్వులు పూయించిన టిల్లు వేణు అనూహ్యంగా జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే షో నుంచి ఎందుకు బయటకు వచ్చాడో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

Director Venu: ఆ కారణంగానే జబర్దస్త్‌ను మానేయాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన బలగం డైరెక్టర్‌ వేణు
Balagam Director Venu

Updated on: Mar 10, 2023 | 9:06 PM

జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కమెడియన్‌ వేణు కూడా ఒకరు. వేణు వండర్స్ అనే టీంతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయాన. ఇప్పుడున్న గెటప్‌ శ్రీను, సుడిగాలి సుధీర్‌ ఆయన టీంలో నుంచి వచ్చినవారే. తన కామెడీ స్కిట్లతో నవ్వుల పువ్వులు పూయించిన టిల్లు వేణు అనూహ్యంగా జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే షో నుంచి ఎందుకు బయటకు వచ్చాడో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. యాజమాన్యంతో విభేదాల వల్లనే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నాడు వేణు. జబర్దస్త్‌కు ముందు కొన్ని సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించిన వేణు ఇప్పుడు మెగాఫోన్‌ పట్టాడు. బలగం సినిమాను తెరకెక్కించి సూపర్‌ హిట్‌ కొట్టాడు. తెలంగాణ కథాంశం నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈనేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు వేణు. ఈ సందర్భంగా తన వృత్తి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా జబర్దస్త్‌ను మానేయడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు.

‘విబేధాల కారణంగా నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను అనడంలో వాస్తవం లేదు. కేవలం సినిమాలపై మక్కువతోనే ఆ షోను వదిలేశాను. మొదటి నుండి నా లక్ష్యం సినిమానే. ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరికతోనే జబర్దస్త్‌ను మానేయాల్సి వచ్చింది. పైగా నేను ఉన్నప్పుడు జబర్దస్త్‌ రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ కూడా వచ్చేది. అయినప్పటికీ సినిమాల కోసం షోను వదులుకొని బయటకు వచ్చాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు వేణు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..