Producer SKN: ఏం చేస్తాం చెప్పండి.. తెలుగు హీరోయిన్ల వివాదంపై SKN రియాక్షన్…

టాలీవుడ్ ప్రోడ్యూసర్ SKN నిర్మించిన బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఎస్కేఎన్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇక మీదట తన సినిమాల్లో తెలుగు హీరోయిన్లను తీసుకోనంటూ చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు ఎస్కేఎన్.

Producer SKN: ఏం చేస్తాం చెప్పండి.. తెలుగు హీరోయిన్ల వివాదంపై SKN రియాక్షన్...
Skn

Updated on: Feb 18, 2025 | 8:24 AM

తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి బేబీ మూవీ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము తెలుగు రాని హీరోయిన్లను అభిమానిస్తామని.. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈ మధ్యనే తనకు అర్థమయిందని ఇటీవల ఎంటర్ ది డ్రాగన్ మూవీ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడని తాను, డైరెక్టర్ సాయి రాజేశ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. దీంతో ఎస్కేఎన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు. తెలుగు వాళ్లు అయి ఉండి తెలుగు సినిమాల్లో మన అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనంటూ ఇలా కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎస్కేఎన్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాహం పై స్పందించారు ఎస్కేఎన్.

“చాలా మంది తెలుగు హీరోయిన్లను తెరకు పరిచయం చేశారు. ఫన్ కోసమో, ఫ్లోలోనో ఓ కాంట్రావర్సీకి రూట్ వేసే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడడం సరి కాదేమో ? ” అంటూ ఓ జర్నలిస్ట్ ఎస్కేఎన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు ఎస్కేఎన్ రియాక్ట్ అయ్యారు. “హాహాహా.. ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు. గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి” అంటూ స్మైలీ ఎమోజీ పోస్ట్ చేశారు. దీంతో ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్లను పరిచయం చేశారేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ఎస్కేఎన్ చాలా మంది తెలుగమ్మాయిలను వెండితెరకు పరిచయం చేశారు. రష్మీ, ఆనంది (ఈరోజుల్లో), మానస (రొమాన్స్), ప్రియాంక జవాల్కర్ (టాక్సీవాలా), వైష్ణవి చైతన్య (బేబీ), హారిక (సంతోష్ శోభన్ సినిమా), ఖుషి (3 రోజెస్) హీరోయిన్లను సినీరంగానికి పరిచయం చేశారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన