Sai Rajesh: అండగా నిలవాలనుకున్నా మేమంతా పిచ్చోళ్లమా.. ? యంగ్ హీరో టీమ్ పోస్ట్ పై బేబీ మూవీ డైరెక్టర్ సీరియస్..

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ తీరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. హిందీ పరిశ్రమ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడి వీడిపై టీమ్ క్లారిటీ ఇస్తూ మరో పోస్ట్ చేసింది. అతడి ఆవేదనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొంది.

Sai Rajesh: అండగా నిలవాలనుకున్నా మేమంతా పిచ్చోళ్లమా.. ? యంగ్ హీరో టీమ్ పోస్ట్ పై బేబీ మూవీ డైరెక్టర్ సీరియస్..
Sai Rajesh, Babil Khan

Updated on: May 06, 2025 | 1:42 PM

బాబిల్‌ ఖాన్‌ సన్నాఫ్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌..బోరున ఏడ్చాడు. గుండె పగిలనంత ఆవేదనతో దు:ఖించాడు. ప్రతి ముక్కలోనూ బాలీవుడ్‌ తీరును తీవ్రంగా ఎండగట్టాడు. కొందరి పేర్లను కూడా ప్రస్తావించారాయన. కానీ సడెన్‌గా ఈ వీడియో డిలీటయింది. బాబిల్‌ ఆవేదనను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ ఆయన టీమ్‌ ఇన్‌స్టాలో ఓ స్టేట్‌మెంట్‌ను పోస్ట్‌ చేసింది. ఆ స్టేట్‌మెంట్‌పై టాలీవుడ్‌ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ ఘాటుగా రియాక్టయ్యారు. వీడియోలో బాబిల్‌ ఖాన్‌ ప్రస్తావించిన వాళ్లు మంచోళ్లయితే.. ఆయనకు అండగా నిలవాలనుకున్న వాళ్లంతా పిచ్చోళ్లా? అని ప్రశ్నించారాయన. నిజంగా అతనికి సపోర్ట్‌ ఇవ్వాలనుకున్నా, కానీ మీ తీరు చూశాక నిర్ణయాన్ని మార్చుకున్నా.. అంటూ ఘాటు పోస్ట్‌ పెట్టారు.

స్పందించిన బాబిల్‌ ఖాన్‌..నా మనసును గాయపర్చారు. రెండేళ్లుగా మీకోసం ఎంతో కష్టపడ్డా. ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నా అంటూ పోస్ట్‌ పెట్టాడు. ఇద్దరి పోస్టులు వైరలయ్యాయి. కాసేపటికే డిలీటయ్యాయి. బాలీవుడ్‌ బేబీలో బాబిల్‌కు ఛాన్స్‌ ఇస్తామని చెప్పి హ్యాండ్‌ ఇచ్చారా? అనే చర్చ రాజుకుంది. మరోవైపు అసలు బాబిల్‌ ఏడుపు నిజమా? లేదంటే ప్రమోషన్‌ స్టంటా? అనే టాక్‌ కూడా పీక్స్‌కు వెళ్లింది. ఇక స్టార్‌ సింగర్‌ సోనూ నిగమ్‌కు కర్నాటక విమర్శల సెగ పెరుగుతోంది.ఇ టీవల బెంగళూరులో నిర్వహించిన కాన్సార్ట్‌లో కన్నడ పాటలు పాడమని ప్రేక్షకులు ఆయన్ని కోరారు. అలాగేనన్నారాయన. కానీ కొందరు వెంటనే కన్నడ పాట పాడాలని ఒత్తిడి చేశారు. అంతే సోను నిగమ్‌ ఆవేశంలో నోరు జారారు. మీలాంటి వారి వల్లే పహల్గామ్‌ దాడులన్నారు. ఆయన వ్యాఖ్యలపై కర్నాటక రక్షణ వేదిక ఫిర్యాదుతో కేసు నమోదయింది. కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆయనపై బ్యాన్‌ విధించబోతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. మ్యాటర్‌ హీటెక్కడంతో సోను నిగమ్‌ స్పందించారు. పహల్గాం దాడి తరువాత ఎవరైనా భాష,మతం పేరిట విమర్శలు చేస్తే వాటిని వ్యతిరేకిస్తున్నా..అందులో భాగంగానే అలా మాట్లాడానని వివరణ ఇచ్చారాయన.

జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ముక్కు సూటిగా ప్రశ్నించే ప్రకాష్‌ రాజ్‌..బాలీవుడ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. బాలీవుడ్‌లో చాలా మంది ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఆరోపించారు. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై స్పందిచారాయన. సూటిగా మాట్లాడే నాతో వర్క్‌ చేస్తే వాళ్లకు సమస్యలు వస్తాయనే భయం ఓ కారణం కావచ్చన్నారు ప్రకాశ్‌రాజ్‌. బాక్సాఫీస్‌ సంగతేమో కానీ విమర్శల మీద విమర్శలతో బాలీవుడ్‌ బ్యాండ్‌ బాజా అవుతోంది. అసలు బాలీవుడ్‌లో క్రియేటివిటీ లేదు, అంతా కట్‌ అండ్‌ పేస్ట్‌ వ్యవహారమేనని సంచలన ఆరోపణలు చేశారు యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. కాపీల పర్వంతో బాలీవుడ్‌ సృజనాత్మకత ఎప్పుడో దివాళా తీసిందన్నారు. కొత్తగా ఆలోచించాల్సిపోయి అతుకులతో కతలు అల్లుతూ పార్ట్‌ 1,,2,,3..4 అంటూ సీక్వెల్స్‌ తీస్తున్నారని విమర్శించారాయన. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన కోస్టావో ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఆ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ ఓ కాపీ క్యాట్‌ అని తన మన్‌ కీ బాత్‌ చెప్పారాయన. చారాణా కోడికి బారాణా మసాలా..బాలీవుడ్‌ అంటే అంతేనా?!..

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..