AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: 40 ఏళ్ల క్రితం బైక్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన సూపర్ స్టార్..

జపాన్ లోనూ సూపర్ స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి సేవలందిస్తున్నారు. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు సూపర్ స్టార్. రజినీకాంత్ తన కెరీర్ లో చేయని పాత్ర లేదు అంటే అతిశయోక్తి కాదేమో.. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ బైక్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు.

Rajinikanth: 40 ఏళ్ల క్రితం బైక్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన సూపర్ స్టార్..
Rajinikanth
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2024 | 7:16 PM

Share

సూపర్ స్టార్ రజినికాంత్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్ కు ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఫిదా అయ్యారు. జపాన్ లోనూ సూపర్ స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి సేవలందిస్తున్నారు. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు సూపర్ స్టార్. రజినీకాంత్ తన కెరీర్ లో చేయని పాత్ర లేదు అంటే అతిశయోక్తి కాదేమో.. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ బైక్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ బైక్ మాములు బైక్ కాదట. 40 ఏళ్ల కిందటి బైక్. అదికూడా రజినీకాంత్ సినిమాలోని ఆయన నడిపిన బైకే..

విషయం ఏంటంటే ఏవీఎం నిర్మాణ సంస్థ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించింది. దాదాపు 90 ఏళ్లుగా ఈ నిర్మాణ సంస్థ సినిమాలను తెరకెక్కిస్తోంది. 90 ఏళ్లు పురస్కరించుకుని ఏవీఎం కంపెనీ తమ బ్యానర్ లో వచ్చిన సినిమాల్లోని వాహనాలను ప్రదర్శిస్తోంది. ఇటీవల చెన్నైలో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించింది ఏవీఎం కంపెనీ. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బయుమ్ పులి సినిమాను ఏవీఎం కంపెనీనే నిమించింది. ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడీగా రాధా నటించారు.

ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏవీఎం నిర్మాణ సంస్థ తెరకెక్కించిన 126వ సినిమా.. ఈ సినిమా రీసెంట్ గా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమాలో సూపర్ రజినీకాంత్ వాడిన బైక్ ను ఎగ్జిబిషన్ లో ఉంచింది. 40 ఏళ్ల క్రితం వాడిన ఆ బైక్ ను ఏవీఎం నిర్మాణ సంస్థ ఎంతో జాగ్రత్తగా మెయింటేన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ బైక్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోజులిచ్చారు. సూపర్ స్టార్ 40 ఏళ్ల కిందటి సుజుకీ బైక్ పై కూర్చుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను సూపర్ స్టార్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.