AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అవతార్​ 2’ షూటింగ్ షురూ…స్పెష‌ల్ సెట్ రెడీ..

జేమ్స్‌ కామెరూన్ తెర‌కెక్కించిన‌‌ వెండితెర విజువ‌ల్ వండ‌ర్ ‘అవతార్‌’కు సీక్వెల్ మూవీస్ రాబోతున్నాయి. అందులో భాగంగా ‘అవతార్‌ 2’ని 2021 డిసెంబరు 17న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసింది. కానీ కరోనావైర‌స్ వీర‌విహారం చేయ‌డంతో.. ప‌రిస్థితులు ఊహించ‌నంత‌గా మారిపోయాయి. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో షూటింగులు అర్ధాంత‌రంగా నిలిచిపోయాయి. సినిమా రిలీజులు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రపరిశ్రమలు షూటింగుల పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు […]

'అవతార్​ 2' షూటింగ్ షురూ...స్పెష‌ల్ సెట్ రెడీ..
Ram Naramaneni
|

Updated on: May 23, 2020 | 2:42 PM

Share

జేమ్స్‌ కామెరూన్ తెర‌కెక్కించిన‌‌ వెండితెర విజువ‌ల్ వండ‌ర్ ‘అవతార్‌’కు సీక్వెల్ మూవీస్ రాబోతున్నాయి. అందులో భాగంగా ‘అవతార్‌ 2’ని 2021 డిసెంబరు 17న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసింది. కానీ కరోనావైర‌స్ వీర‌విహారం చేయ‌డంతో.. ప‌రిస్థితులు ఊహించ‌నంత‌గా మారిపోయాయి. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో షూటింగులు అర్ధాంత‌రంగా నిలిచిపోయాయి. సినిమా రిలీజులు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రపరిశ్రమలు షూటింగుల పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ‘అవతార్‌ 2’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తున్నారు.

ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూస‌ర్ జాన్‌ లాండూ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. “మా అవతార్‌ కోసం స్పెష‌ల్ గా వేసిన సెట్లు రెడీ అయ్యాయి. వచ్చేవారంలో న్యూజిలాండ్‌లో షూటింగ్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని పోస్ట్‌ చేశారు. సముద్ర గర్భం నేపథ్యంగా సాగే సీన్స్ షూట్ చేయ‌నున్నారు. ప్రత్యేకంగా వేసిన బోటు సెట్లకు సంబంధించిన ఫొటోలను జాన్ నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. కాగా అవ‌తార్ ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కులను మ‌రో ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మంత్ర ముగ్దుల్ని చేసింది ఈ చిత్రం. దానికి సీక్వెల్ అంటే ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. మ‌రి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే.

డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
బెడ్ రూమ్‌లో కత్తెర ఎందుకు ఉంచొద్దు.. అసలు విషయం తెలిస్తే..
బెడ్ రూమ్‌లో కత్తెర ఎందుకు ఉంచొద్దు.. అసలు విషయం తెలిస్తే..