ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచారు . బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయన రేవతి భర్త భాస్కర్ ను కలిసి పరామర్శించారు. అనంతరం రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. ‘శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి ఇస్తున్నాను. శని ఉండడం వల్ల అల్లు అర్జున్ కు ఈ సంఘటన జరిగింది. అతని జాతకం వచ్చే ఏడాది మార్చి మార్చి 29 వరకు బాగోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కావాలని ఏది చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయి. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి కళ్ళ లోంచి నీళ్లు వచ్చాయి. శ్రీ తేజ కోలుకుంటాడన్న నమ్మకం ఉంది. కచ్చితంగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. శ్రీ తేజకు మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో చేస్తాను. పాప కు రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. కాబట్టి నేను సినిమా వాడినే. అందుకే శ్రీతేజ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాను.వారం రోజుల్లో హోమం నిర్వహిస్తాను. ఆ పిల్లాడికి ఏమి కాదు’ అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా బుధవారం శ్రీ తేజ్ ను పరామర్శించారు. పిల్లాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ్‌ను చూడాలని అందరికీ ఆత్రుతగా ఉందని.. కొన్న పరిధుల వల్ల కుదరడం లేదన్నారు. తమ కొరియోగ్రాఫర్స్ సొసైటీ తరఫున శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జానీ మాస్టర్ వెంటన ఆయన సతీమణి కూడా ఉన్నారు.
అంతకు ముందు శ్రీ తేజ్ కుటుంబానికి అల్లు అరవింద్ రూ. 2కోట్ల ఆర్థిక సాయం అందజేశారు.
#JaniMaster and Astrologer Venu Swamy Visit Sai Teja at KIMS Hospital
Choreographer #JaniMaster and renowned astrologer Venu Swamy visited #KIMS Hospital to meet Sai Teja, offering their support and solidarity during this challenging time.
Further updates on Sai Teja’s… pic.twitter.com/mMm4jgm5r9
— Reel Radar (@reelradar786) December 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.