Aakasham : ప్రేమ, మోసం,లైఫ్‌లోని ఇతర భావోద్వేగాల “ఆకాశం”.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

|

Oct 29, 2022 | 8:30 PM

ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఆకాశం’ టీజర్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Aakasham : ప్రేమ, మోసం,లైఫ్‌లోని ఇతర భావోద్వేగాల ఆకాశం.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
Aakasham
Follow us on

వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అశోక్ సెల్వన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆకాశం. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఆకాశం’ టీజర్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై  ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కి విషెష్ తెలియజేశారు.

అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కనిపించారు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక పాత్రలను తీర్చి దిద్దిన తీరు, వాటిని వారు క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

ప్రేమ, మోసం సహా లైఫ్‌లోని ఇతర భావోద్వేగాలు హీరో అశోక్ సెల్వన్ రోలర్ కోస్టర్‌లా ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది సినిమా అని స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ట్రైలర్‌లో విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్, గోపి సుందర్ సంగీత సారథ్యం వహించిన  బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించినట్లు స్పష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.