Thalapathy Vijay: దళపతి విజయ్‌కు ఓటు వేయను.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో
విజయ్ సినిమాలు వందల కోట్ల రూపాయిలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంటాయి. రీసెంట్‌గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దళపతి విజయ్. ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తన పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశారు.

దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. విజయ్ సినిమాలు వందల కోట్ల రూపాయిలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంటాయి. రీసెంట్‌గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దళపతి విజయ్. ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తన పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశారు. తమిళగ వెట్రి కజగం అనే పేరును ప్రకటించారు విజయ్. ఇదిలా ఉంటే విజయ్ సినిమాల్లోకి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరికొంతమంది మాత్రం విజయ్ సినిమాలకు దూరం అవుతారని ఫీల్ అవుతున్నారు.
విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గోట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఈ ఇదే అయన లాస్ట్ సినిమా అవుతుందని కొందరు అంటున్నారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి రావడం పై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో తమిళ్ స్టార్ నటుడు అరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టం, కమల్ హాసన్ అంటే కూడా చాలా అభిమానం. అలాగే దళపతి విజయ్ అంటే కూడా ఇష్టమే కానీ వీరు రాజకీయాల్లోకి వస్తే మాత్రం నేను ఓటు వేయను అని అన్నారు. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదు అన్నారు అరవింద్ స్వామి. సినిమాలో హీరో ప్రజలను కాపాడినట్లు రాజకీయాల్లో చేయడం అస్సలు కుదరదు అన్నారు అరవింద్ స్వామి. ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రాజకీయాలకు నేర్చుకోవడం కూడా ముఖ్యం అని అన్నారు అరవింద్ స్వామి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దళపతి విజయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




