బాలీవుడ్‌లోకి అరుంధతి.. హీరోయిన్‌గా ఊహించని బ్యూటీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ మూవీస్ చాలా ఉన్నాయి. అందులో అరుంధతి ఒకటి. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి ఈ సినిమా. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 2009లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అనేక అవార్డ్స్ అందుకుంది.

బాలీవుడ్‌లోకి అరుంధతి.. హీరోయిన్‌గా ఊహించని బ్యూటీ..
Arundhati Movie

Updated on: Oct 30, 2025 | 12:21 PM

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. కేవలం 13 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ సినిమాతో అనుష్క పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అరుంధతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది అనుష్క శెట్టి. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులో పశుపతి పాత్రలో సోనూసూద్, జేజమ్మ పాత్రలో అనుష్క యాక్టింగ్ అదరగొట్టేశారు. ఈ సినిమాతో అనుష్క నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతోనే అనుష్కకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. అరుంధతి సినిమా ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అయ్యింది. అలాగే పలు భాషల్లో డబ్ కూడా అయ్యింది. ఇక ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో జేజమ్మగా నటించే హీరోయిన్ ఎవరో కాదు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. అవును శ్రీలీలను బాలీవుడ్ అరుంధతి రీమేక్ లో నటిస్తుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌కు దర్శకత్వం వహించిన మోహన్ రాజా ఇప్పుడు బాలీవుడ్ అరుంధతిని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్. కాగా శ్రీలీల తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో అరుంధతి రీమేక్ చేయడం పై అభిమానులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.