Sarkaru Vaari Paata: సినిమాలో మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తారు: ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్ ప్రకాష్

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట విడుదలకు సిద్దమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Sarkaru Vaari Paata: సినిమాలో మహేష్ బాబు  నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తారు: ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్ ప్రకాష్
Sarkaru Vaari Paata
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 25, 2022 | 6:54 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) విడుదలకు సిద్దమౌతుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘సర్కారు వారి పాట సినిమాకు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ.. పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా అని అన్నారు. అదేవిధంగా మహేష్ బాబుతో ఇది7 వ సినిమా. సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలని చర్చిస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయన సెట్ లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్ లా వుంటుంది అన్నారు.

అలాగే సర్కారు వారి పాట స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపథ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం అన్నారు. భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా వుంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబద్ లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్ లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం. కొన్ని మన ఇమాజినేషన్ కి తగ్గట్టు బయట దొరకవు. మన ఊహకు తగ్గట్టు సెట్ వేస్తే మనం అనుకున్న ఇమాజినేషన్ ని స్క్రీన్ పై ప్రజంట్ చేయగలం. ముఖ్యంగా సాంగ్స్ సెట్స్ మనం ఫీలై చేయాలి తప్పితే నేచురల్ గా దొరకవు. సర్కారు వారి పాట కోసం వేసిన సాంగ్స్ సెట్స్ తెరపై అద్భుతంగా వుంటాయని చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకి ఒకేలా వర్క్ చేస్తాం. కొన్నిటికి మంచి పేరు రావచ్చు. పెద్ద సెట్స్ వుంటే అవార్డ్స్ వస్తాయి. సర్కారు వారి పాట కోసం చాలా వర్క్ చేశాం. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ ఇలా చాలా డిజైన్ చేశాం. సినిమా చూశాక అసలు ఇది సెట్టా ? అని కనిపెట్టలేరు. అంత నేచురల్ గా వుంటాయి అని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..

మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!