Arjuna Phalguna : ఆసక్తికరంగా ‘అర్జున.. ఫల్గుణ’ పోస్టర్.. మరో విభిన్న కథతో రానున్న హీరో శ్రీవిష్ణు..
విభిన్న చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు...
Arjuna Phalguna : విభిన్న చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ చూసుకుపోతున్నాడు.తాజాగా ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘అర్జున.. ఫల్గుణ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. పోలీసు వెహికిల్ ఛేజ్ చేస్తుండగా కొంతమంది పారిపోతున్నట్టు పోస్టర్ లో చూడవచ్చు. అయితే వారి మొఖాలు క్లియర్ గా కనిపించాలంటే పోస్టర్ ను తిరగేసి చూడాలి. ఆసక్తికరంగా ఉన్న ఈపోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో.. శ్రీ విష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Gurthunda Seethakalam : అందమైన ప్రేమ భావాలను మొఖంలో అద్భుతంగా పలికిస్తున్న ప్రేమపావురాలు…