Ariyana Glory: సమంత స్పెషల్ సాంగ్‌కు తన స్టైల్‌లో స్టెప్పులేసి బిగ్ బాస్ బ్యూటీ.. ఎక్స్‌ప్రెషన్స్ కుమ్మేసిందిగా..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ

Ariyana Glory: సమంత స్పెషల్ సాంగ్‌కు తన స్టైల్‌లో స్టెప్పులేసి బిగ్ బాస్ బ్యూటీ.. ఎక్స్‌ప్రెషన్స్ కుమ్మేసిందిగా..
Ariyana

Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2021 | 12:44 PM

Pushpa: The Rise: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్ల మార్క్ ట‌చ్ చేసింది. అలవైకుంఠ‌పురంలో వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో భారీ ధ‌ర‌ల‌కు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రంగంస్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది. సమంత సాంగ్ ఇటీవలే విడుదల చేశారు చిత్రయూనిట్ ఈ పాట కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఊ అంటావా ఊహూ అంటావా మామ అంటూ సాగుతుంది ఈ పాట. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‏తో పాడిన ఈ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. ఇంద్రావతి చౌహాన్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సమంత స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్‏తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ అరియనా అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..