Kanguva : ఇదెక్కడి రచ్ఛరా సామీ..! కంగువ కొంపముంచింది ఆ హీరోల అభిమానులేనా..!

కోలీవుడ్‌లో 'కంగువా' ఫ్లాప్ కావడానికి రెండు అభిమానుల సంఘాలు కారణం అని అంటున్నారు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన సూర్య చిత్రం 'కంగువా'.

Kanguva : ఇదెక్కడి రచ్ఛరా సామీ..! కంగువ కొంపముంచింది ఆ హీరోల అభిమానులేనా..!
Kanguva
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2024 | 12:34 PM

బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, సౌత్ ఇండస్ట్రీ అయినా.. ఇప్పటి వరకు ఏ సూపర్ స్టార్ కూడా ‘ఫ్యాన్ వార్’ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇంతకుముందు కూడా ఫ్యాన్స్ వార్స్ ఉండేవి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో, ఇద్దరు పెద్ద హీరోల అభిమానుల మధ్య కొనసాగుతున్న వివాదాలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. కోలీవుడ్‌లో ‘కంగువా’ ఫ్లాప్ కావడానికి రెండు అభిమానుల సంఘాలు కారణం అని అంటున్నారు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన సూర్య చిత్రం ‘కంగువా’. ఈ సినిమా నిర్మాత ధనంజయన్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వల్లే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిందని ఆరోపించారు. ధనంజయన్ మాట్లాడుతూ..  కోలీవుడ్ సూపర్ స్టార్స్  దళపతి విజయ్ , అజిత్ కుమార్ అభిమానులు తమ సినిమాను ట్రోల్ చేశారని అన్నారు.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

అయితే సూర్య అభిమానులు, దళపతి విజయ్ అభిమానులు,  అజిత్ కుమార్ అభిమానులు ఒకరితో ఒకరు అస్సలు కలిసి ఉండరు. ఈ కారణంగానే వీరిలో ఒకరి సినిమా విడుదలైతే మిగిలిన ఇద్దరు హీరోల అభిమానులు కలిసి మూడో నటుడి సినిమాకు నెగెటివ్ ప్రచారం చేస్తుంటారు.  అలాగే సోషల్ మీడియాలోనూ పెద్దెత్తున ట్రోల్ చేస్తుంటారు. సూర్య చిత్రం ‘కంగువ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే,  విజయ్, అజిత్ కుమార్ అభిమానులు సూర్య చిత్రాన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. చాలా మంది విజయ్ అభిమానులు ఈ సినిమాని యావరేజ్ సినిమా అన్నారు. వాస్తవానికి, సూర్య అభిమానులు, అజిత్ కుమార్ అభిమానులతో చేతులు కలిపి విజయ్ ‘గోట్’ని ట్రోల్ చేశారు. దానికి ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారని కోలీవుడ్ టాక్.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

నిర్మాత ధనంజయన్ ‘అభిమానుల సంఘం’పై ఈ ఆరోపణ తర్వాత కోలీవుడ్ లో పెద్ద చర్చ మొదలైంది. అభిమానులు సోషల్ మీడియాలో సినిమాను ట్రోల్ చేసినప్పుడు, ఆ చిత్రానికి ఖచ్చితంగా నెగెటివ్ ప్రచారం వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరికొంతమంది సినిమాలో కంటెంట్ ఉంటే ఆ ట్రోల్స్ సినిమాను ఏం చేయలేవు అంటున్నారు. సన్నీ డియోల్ చిత్రం గదర్ 2 పైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయినా సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల అభిమానులు తరచూ తమ మధ్య గొడవలు పెట్టుకుంటారు. కానీ వారి సినిమా భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి అని అంటున్నారు.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..