Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా ?.. వాళ్ళకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..

మంగళవారం ఎన్నికల సంఘానికి పవన్ నామినేషన్ సమర్పించారు. అఫిడవిట్ ప్రకారం జనసేనానికి ఆస్తులు రూ. 164.5 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే రూ. 64.26 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి. అందులో వివిధ బ్యాంకుల నుంచి రూ. 17,56,84,453.. వ్యక్తుల నుంచి రూ. 46 కోట్ల 70 లక్షలు ఉన్నాయట. అలాగే సామాజిక సేవలకు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం రూ.20 కోట్లకు పైగానే విరాళాలు అందించారట. ఇక జనసేన పార్టీకి రూ. 17,15,00,000 ఉన్నాయి. ఆయన దగ్గర 10 కార్లు, ఓ స్పోర్ట్స్ బైక్ ఉన్నాయని..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా ?.. వాళ్ళకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2024 | 1:25 PM

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మరింత వేడెక్కింది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ నిలబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఎన్నికల సంఘానికి పవన్ నామినేషన్ సమర్పించారు. అఫిడవిట్ ప్రకారం జనసేనానికి ఆస్తులు రూ. 164.5 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే రూ. 64.26 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి. అందులో వివిధ బ్యాంకుల నుంచి రూ. 17,56,84,453.. వ్యక్తుల నుంచి రూ. 46 కోట్ల 70 లక్షలు ఉన్నాయట. అలాగే సామాజిక సేవలకు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం రూ.20 కోట్లకు పైగానే విరాళాలు అందించారట. ఇక జనసేన పార్టీకి రూ. 17,15,00,000 ఉన్నాయి. ఆయన దగ్గర 10 కార్లు, ఓ స్పోర్ట్స్ బైక్ ఉన్నాయని.. అలాగే తాను పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు అఫిడవిట్‏లో జనసేనాని వెల్లడించారు. అలాగే అఫిడవిట్‏లో ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు పవన్.

ఫ్యామిలీ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్‏కు నలుగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మాజీ భార్య రేణు దేశాయ్ సంతానం దేశాయ్ అకీరా నందన్, దేశాయ్ ఆద్య. అలాగే అన్నా లెజినోవా సంతానం పొలినా అండ్ ఝానీ, కొణిదెల మార్క్ శంకర్. వీరిద్దరూ ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) అని అఫిడవిట్లో పేర్కొన్నారు పవన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్ అన్నా లెజినోవా రష్యాకు చెందిన మహిళ. వాస్తవానికి దంపతుల్లో ఒకరు భారతీయులై, మరొకరు విదేశీయులు అయినప్పుడు వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు.

ఈ సిటిజన్ షిప్ (ఓసీఐ) ఉన్నవారికి ఇండియాలో నిర్ధిష్ట కాలం ఉంటే వారు భారత పౌరసత్వం.. భారతీయులుగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓవర్సీస్ సిటిజన్‏గా గుర్తింపు పొందిన వారికి భారత్ లో లైఫ్ లాంగ్ వీసా ఇస్తారు. వారు కూడా ఎన్నారైల మాదిరిగానే మన దేశంలో ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందొచ్చు. కానీ వీరికి ఓటు హక్కు మాత్రం ఉండదు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు. ఉన్నత అధికారాలు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్టు, జడ్జిలు, న్యాయనిర్ణేతల్లాంటి రాజ్యంగా బద్ధమైన పదవులను వారు పొందలేరు. అలాగే దేశంలో వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను కొనుగోలు చేయలేరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.