AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహించని షాక్ ఇచ్చిన అమర్ దీప్, తేజస్వి.. హ్యాపీగా లేము అంటూ బాంబ్ పేల్చిన జంట

సీరియల్స్ తో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. సీరియల్స్ ఫాలో అయ్యే ప్రేక్షకుల్లో అమర్ దీప్ కు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ షోతో అమర్ దీప్‌కు మంచి క్రేజ్ వచ్చింది. విన్నర్‌గా నిలవాల్సిన అమర్ దీప్.. చివరకు రన్నర్ గా బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి రాక ముందే ఓ స్క్రిప్ట్‌ను ఓకే చేసేశాడు. ఆ సినిమాలో సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా చేస్తుంది.

ఊహించని షాక్ ఇచ్చిన అమర్ దీప్, తేజస్వి.. హ్యాపీగా లేము అంటూ బాంబ్ పేల్చిన జంట
Amardeep, Tejaswini
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2024 | 9:02 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడాకులు కామన్ అవుతున్నాయి. ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో తెలియడం లేదు. సడన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి షాక్ ఇస్తున్నారు. సమంత , నాగచైతన్య దగ్గర నుంచి చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. రీసెంట్ గా ధనుష్- ఐశ్వర్య, అలాగే జయం రవి- ఆర్తి , జీవి ప్రకాష్ ఇలా చాలా మంది విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి షాక్ ఇచ్చారు. సినిమా సెలబ్రెటీలతో పాటు సీరియల్ నటులు కూడా విడాకులు అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ జంట కూడా విడిపోతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ జంట కూడా పెళ్లి తర్వాత హ్యాపీగా లేము అని చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు.

ఆ జంట ఎవరో కాదు అమర్ దీప్, తేజస్వి. ఈ జంట చాలా మందికి ఫెవరేట్. మొగుడు పెళ్ళాలు అంటే ఇలానే ఉండాలి అని అందరూ అనుకునేలా చేశారు. ఎంతో అన్యుణ్యంగా ఉంటారు. అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తేజస్వి బయట చాలా కష్టపడింది. అమర్ దీప్ ను గెలిపించడానికి చాలా కష్టపడటంతో పాటు బయట ట్రోలింగ్ ను కూడా తట్టుకొని నిలబడింది. తాజాగా జంట హ్యాపీగా లేరంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

రీసెంట్ గా ఓ టీవీ షోకు హాజరయ్యారు. పెళ్లి అనే థీమ్ తో సీరియల్ నటులు భార్యలతో కలిసి పెళ్లి గెటప్ లో వచ్చారు. అమర్ దీప్, తేజస్విని కూడా ఈ షోకు హాజరయ్యారు. ఈ షోకు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఓంకార్ అమర్, తేజస్విని మీరిద్దరూ భార్యాభర్తలుగా 100 పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా? లేదంటే.. ఒక చైర్ వదిలేసి కూర్చోండి. అని చెప్పాడు దానికి ఇద్దరూ రెండు చైర్లు వదిలేసి కూర్చున్నారు. ఈ షో ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నిజంగా ఈ ఇద్దరూ హ్యాపీగా లేరా.? లేక షో కోసమే ఇలా చెప్తున్నారా.? అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు