ప్రభాస్ సినిమా : రెహ్మాన్‌కు ఎంతిస్తున్నారో తెల్సా !
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆయన సైన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్తున్నాయి. ప్రభాస్ అంటే ఆ స్థాయి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
Prabhas Deepika Film : బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆయన సైన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్తున్నాయి. ప్రభాస్ అంటే ఆ స్థాయి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తాజాగా ఇప్పుడు వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో తన 21వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఇది పాన్ ఇండియా కాదు..పాన్ వరల్డ్ అని చెప్తున్నాడు డైరెక్టర్. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహ్మాన్ ను ఫైనల్ చేశారని, అతడికి దాదాపు రూ.4 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే . దీంతో అంచనాలు గగనానికి చేరాయి. మిగిలిన యాక్టర్స్ ఎంపిక కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా ప్లాన్ చేస్తోంది నిర్మాణ సంస్థ. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో నిర్మించనున్నారు. కాగా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా రెడీ అవుతుంది వైజయంతీ మూవీస్. మరీ తెలుగు సినిమా ఖ్యాతిని నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో ఏ రేంజ్ కు తీసుకెళ్తాడో చూడాలి.
Also Read : 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కరోనా పాజిటివ్ !