మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు అమృత ప్ర‌ణ‌య్ నోటీసులు

మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు అమృత ప్ర‌ణ‌య్ కోర్టు ద్వారా నోటీసులు పంపారు. అనుమ‌తులు లేకుండా త‌న క‌థ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె న‌ల్గొండ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిష‌న్ వేశారు.

మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు అమృత ప్ర‌ణ‌య్ నోటీసులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2020 | 3:57 PM

Amrutha Pranay Reaction On RGV Murder Movie : మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు అమృత ప్ర‌ణ‌య్ కోర్టు ద్వారా నోటీసులు పంపారు. అనుమ‌తులు లేకుండా త‌న క‌థ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె న‌ల్గొండ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ మేరకు ఆమె కోర్టు ద్వారా మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌లు న‌ట్టి క్రాంతి, న‌ట్టి క‌రుణ‌‌లకు నోటీసులు పంపారు. అయితే మ‌ర్డ‌ర్ చిత్రానికి క్రాంతి, క‌రుణ‌ల‌తో పాటు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే అమృత, ఆర్జీవీకి నోటీసు పంప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌ర్డ‌ర్ సినిమా విడుద‌లను నిలుప‌ద‌ల చేయాల‌ని, ప‌బ్లిసిటీ వెంట‌నే ఆపమ‌ని కోరుతూ అమృత‌ కోర్టును కోరారు. కాగా ఈ నెల 6న నిర్మాత‌లు కోర్టుకు హాజ‌రై, వారి వాద‌న‌ను తెలపాల‌ని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్ప‌టికే ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. త్వ‌ర‌లోనే పూర్తి చిత్రాన్ని త‌న ఓటీటీ ఫ్లాట్ ఫామ్..ఆర్జీవీ వ‌రల్డ్ థియేట‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు వ‌ర్మ‌.

Read More : 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీకి క‌రోనా పాజిటివ్ !