AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పాకీజా దీన స్థితికి చలించిన పవన్ కల్యాణ్.. నటికి తక్షణ సాయం.. ఎంతంటే?

ఒకప్పుడు పాకీజాగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి వాసుకి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. తనను ఆదుకోవాలంటూ ఆమె ఇటీవల ఒక వీడియోను రిలీజ్ చేశారు. నటి దీన స్థితిని చూసి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాకీజాకు తక్షణ సాయం ప్రకటించారు.

Pawan Kalyan: పాకీజా దీన స్థితికి చలించిన పవన్ కల్యాణ్.. నటికి తక్షణ సాయం.. ఎంతంటే?
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jul 01, 2025 | 7:24 PM

Share

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం (జులై 01) మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని నటితెలిపారు. కాగా  ఇటీవల వాసుకి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను దీనస్థితిలో ఉన్నట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు . ‘‘నేను హాస్య నటి పాకీజాను. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు నా నమస్కారాలు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మూడేళ్లుగా సినిమా అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్నాను. ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో నా సొంత ఊరుకు వచ్చేశాను. ఏదైనా సాయం చేస్తారేమోనని సీఎంను కలవడానికి నేను రెండుసార్లు విజయవాడ వచ్చాను. కానీ, కలవడం చాలా కష్టమైంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంను కలవాలని ప్రయత్నించినా కలవలేకపోయాను.

‘ ఏపీలో నాకు నెల నెలా పెన్షన్‌ వచ్చేట్లు ఏదైనా సాయం చేయండి. మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటాను. భర్త, పిల్లలు ఎవరూ లేరు. అనాథగా  జీవితం గడుపుతున్నాను.  గతంలో చిరంజీవి గారు, నాగబాబు గారు సాయం చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు గారు, పవన్ గారు దయచేసి నన్ను ఆదుకోవాలి. నాకు కనీసం పెన్షన్ అందేలా చేయండి’’ అని వాసుకి కోరారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిని చూసిన పవన్ కల్యాణ్ తక్షణ సాయం కింద ఆమెకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

నటి పాకీజాకు ఆర్థిక సాయం అందజేస్తోన్నజనసేన నేతలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..