ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ నియమితులయ్యారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లో జరుగుతోన్న విశ్వంభర మూవీ సెట్ కి వెళ్లిన మంత్రి చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి కందుల దుర్గేష్ కు స్వాగతం పలికి శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. విశ్వంభర సెట్లోనే సినీ పరిశ్రమ అభివృద్ధి, పరిష్కరించాల్సిన సమస్యలపై చిరంజీవితో చర్చలు జరిపారు మినిష్టర్ కందుల దుర్గేష్. అనంతరం మంత్రితో భేటీ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి. కందుల దుర్గేష్ తో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ .. ‘మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు! తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు’
‘అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు మూవీ యూనిట్ సభ్యులు ఉన్నారు.
మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐… pic.twitter.com/R7tDsrPR6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024
కాగా బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న విశ్వంభర మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో త్రిషతో మరో ఇద్దరు హీరోయిన్లు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని… pic.twitter.com/ZYg9YsSh6o— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.