- Telugu News Photo Gallery Cinema photos Tollywood director tivikram srinivas and Prashanth Neel always trending without any updates
అప్‌డేట్ లేకపోయినా.. ట్రెండింగ్ లో ఉంటున్న స్టార్ సౌత్ డైరెక్టర్లు
సాధారణంగా ఏ దర్శకుడైనా లైమ్ లైట్‌లో ఉండాలి అంటే ఓ బిగ్ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ ఉండాలి. అలాంటప్పుడు ఆ డైరెక్టర్ గురించి న్యూస్ ట్రెండ్ అవుతుంది. కానీ సౌత్‌లో ఇద్దరు దర్శకులు మాత్రం ఈ విషయంలో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా... న్యూస్‌లో ట్రెండ్ అవుతున్నారు.. ఆ ఇద్దరు కెప్టెన్స్. ఎవరు వాళ్లు అనుకుంటున్నారా చూద్దాం చిన్న బ్రేక్ తరువాత. గుంటూరు కారం రిలీజ్ తరువాత చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Updated on: Jun 20, 2024 | 12:23 PM

సాధారణంగా ఏ దర్శకుడైనా లైమ్ లైట్‌లో ఉండాలి అంటే ఓ బిగ్ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ ఉండాలి. అలాంటప్పుడు ఆ డైరెక్టర్ గురించి న్యూస్ ట్రెండ్ అవుతుంది. కానీ సౌత్‌లో ఇద్దరు దర్శకులు మాత్రం ఈ విషయంలో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా... న్యూస్‌లో ట్రెండ్ అవుతున్నారు.. ఆ ఇద్దరు కెప్టెన్స్. ఎవరు వాళ్లు అనుకుంటున్నారా చూద్దాం చిన్న బ్రేక్ తరువాత.

గుంటూరు కారం రిలీజ్ తరువాత చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇంత వరకు నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్‌తో మూవీస్ ఉంటాయన్న ప్రచారం జరుగుతున్నా ఎనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కానీ ఆ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన న్యూస్ మాత్రం ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా గురూజీ తిరుమల వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. సోమవారం కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమల చేరుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ కావటంతో మరోసారి గురూజీ ట్రెండింగ్‌లోకి వచ్చారు.

సాండల్‌వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇలాగే న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు. సలార్ రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకున్నారు ప్రశాంత్. ఎన్టీఆర్ సినిమాతో పాటు సలార్ 2 కూడా లైన్‌లో ఉన్నా ఇంకా ఏ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఆ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తూనే ఉన్నాయి.

ఆగస్టులో ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్, ఆ తరువాత షార్ట్ గ్యాప్‌లో సలార్ 2 సెట్స్ మీదకు రానుంది. వీటితో పాటు కేజీఎఫ్ 3కి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతూనే ఉంది. ఈ వార్తలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు ప్రశాంత్ నీల్.




