మ‌రోసారి అటువంటి పాత్ర‌కే మొగ్గు చూపిన అనుష్క‌..?

హీరోయిన్ అనుష్క తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఆమెను ఇక్క‌డి జ‌నాలు బాగా ఓన్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై త‌న న‌ట‌న‌తో, ఆమె స్క్రీన్ పై త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఆమె ప్రేక్ష‌కుల మ‌ది దోచుకుంది. ఇక తెలుగ‌లో ఫిమేల్ లీడ్ క‌థ‌ల‌కు అనుష్క కేరాఫ్ అడ్రస్​గా మారిపోయింది.

మ‌రోసారి అటువంటి పాత్ర‌కే మొగ్గు చూపిన అనుష్క‌..?
Ram Naramaneni

|

Jun 15, 2020 | 1:30 PM

హీరోయిన్ అనుష్క తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఆమెను ఇక్క‌డి జ‌నాలు బాగా ఓన్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై త‌న న‌ట‌న‌తో, ఆఫ్ స్క్రీన్ పై త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఆమె ప్రేక్ష‌కుల మ‌ది దోచుకుంది. ఇక తెలుగు‌లో ఫిమేల్ లీడ్ క‌థ‌ల‌కు అనుష్క కేరాఫ్ అడ్రస్​గా మారిపోయింది. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి చిత్రాలు ఆమె రేంజ్ ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లాయి. ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ గా మార్చేశాయి. ఇప్పుడు అదే త‌ర‌హాలో మ‌రో మూవీకి జేజేమ్మ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఓ యంగ్ డైరెక్ట‌ర్, అనుష్కను మైండ్ లో పెట్టుకుని సిద్ధం చేసిన ఓ కథను ఇటీవలే ఆమెకు వినిపించినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ప్రార‌భమైన‌ట్లు స‌మాచారం. ఇటీవల అనుష్క ‘నిశ్శబ్దం’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu