దండం రా దూత..! ఎడిటింగ్ అదిరిందిగా..!! పెద్ది సాంగ్‌కు ఏఎన్ఆర్ స్టెప్పులు..
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఈ సాంగే వినిపిస్తుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సినిమా పక్కా హిట్ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే పెద్ది సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.
చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిక్కిరిచిక్కిరి అంటూ సాంగ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చరణ్ డాన్స్ తో అదరగొట్టాడు. అలాగే బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ తన గ్లామర్ తో కవ్వించింది. ఇక సాంగ్ సూపర్ బ్లాస్ట్ అయ్యింది. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే చిక్కిరి చిక్కిరి సాంగ్ 50మిలియన్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..
ఇదిలా ఉంటే సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందులోని హుక్ స్టెప్ తో అభిమానులు, నెటిజన్స్ రకరకాల రీల్స్ చేస్తున్నారు. చిన్న పెద్ద అని లేకుండా అందరూ పెద్ది సినిమా సాంగ్ కు రీల్స్ చేస్తున్నారు. అలాగే కొందరు ఈ సాంగ్ ను ఎడిట్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు పెద్ది సాంగ్ కు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఓ వీడియో ఎడిట్ చేశారు. 1971లో విడుదలైన ప్రేమనగర్ సినిమాలోని.. “నేను పుట్టాను ఈ లోకం నవ్వింది అనే సాంగ్ కు పెద్ది సాంగ్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు కొందరు నెటిజన్స్. ఏఎన్ఆర్ స్టెప్పులకు పెద్ది సాంగ్ సరిగ్గా సూట్ అయ్యింది. దాంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే
పెద్ది సాంగ్ కు ఏఎన్ఆర్ స్టెప్పులు.. వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








