AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar: తమిళ్ హీరో కార్తీ ‘సర్ధార్’ కోసం రంగంలోకి టాలీవుడ్ స్టార్ హీరో..

తమిళ్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మొదటి సినిమానుంచి కార్తీ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్స్ అందుకున్నాయి. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా..

Sardar: తమిళ్ హీరో కార్తీ 'సర్ధార్' కోసం రంగంలోకి టాలీవుడ్ స్టార్ హీరో..
Karthi
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2022 | 8:14 AM

Share

తమిళ్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మొదటి సినిమానుంచి కార్తీ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్స్ అందుకున్నాయి. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోన్నాడు కార్తీ. ఇటీవలే సుల్తాన్ సినిమాతో ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుంది. ఇటీవలి కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలని సెలక్టీవ్ గా పంపిణీ చేస్తూ, క్యాలిటీ చిత్రాలను అందించే నిర్మాణ సంస్థలతో జతకడుతోంది.

కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘అభిమన్యుడు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు ‘సర్దార్‌’ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి