Suma Kanakala: ఆ పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు.. వీడియో చూశారా?
భయపడిపోయిన రోషన్ పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం వినకుండా కారు డిక్కీని ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఇక చేసేదేమి లేక డిక్కీని ఓపెన్ చేశారు రోషన్ అతని స్నేహితులు. అందులో సూట్‌కేస్‌లను తెరచి చూడగా పోలీసులు షాక్ తిన్నారు. ఇంతకీ ఆ సూట్ కేసుల్లో ఏమున్నాయో తెలుసా?

స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఓ పార్టీకి తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళుతోన్న రోషన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. విధుల్లో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రోషన్‌తో పాటు అతని ఫ్రెండ్స్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. పైగా తమకున్న స్టార్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని వాడుకుని అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసులు పట్టు వదల్లేదు. అనుమానం రావడంతో వారితోనే కార్ డిక్కీ ఓపెన్ చేయించారు పోలీసులు. భయపడిపోయిన రోషన్ పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం వినకుండా కారు డిక్కీని ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఇక చేసేదేమి లేక డిక్కీని ఓపెన్ చేశారు రోషన్ అతని స్నేహితులు. అందులో సూట్‌కేస్‌లను తెరచి చూడగా పోలీసులు షాక్ తిన్నారు. ఇంతకీ ఆ సూట్ కేసుల్లో ఏమున్నాయో తెలుసా? జిలేబీలు, బబుల్ గమ్స్. ఈపాటికే అర్థమై ఉంటుంది. ఈ తతంగమంతా ఓ రకమైన ప్రాంక్ అని. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సుమ కనకాల కొడుకు హీరోగా ‘బబుల్ గమ్’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మానస చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రవిక్రాంత్ దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఇలాంటి ఓ ప్రాంక్ క్రియేట్ చేశాడు రోషన్. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ఫీవర్ నడుస్తుండడంతో సూట్ కేసులతో పోలీస్ రైడింగ్‌లో దొరికిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇటీవల తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి తెలుగు నటీనటులు ఇలాంటి ప్రాంక్స్‌నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆ మధ్యన విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం రోడ్డు మీదే నానా హంగామా చేశాడు. అలాగే అల్లరి నరేష్ తన ‘ఉగ్రం’ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా యాంకర్ సుమను అరెస్టు చేసినట్లునమ్మించాడు. ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తూ పోలీసుల రైడ్‌లో దొరికపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు రోషన్ కనకాల.
సూట్ కేసులో ఏమున్నాయంటే?
సుమ కనకాల ఫ్యామిలీ ఫొటో..
View this post on Instagram
డిసెంబర్ 29న బబుల్ గమ్ సినిమా రిలీజ్..
View this post on Instagram







