Anasuya: సౌత్‌లో అనసూయ సందడి మాములుగా లేదుగా.. మాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న అందాల యాంకర్..
Anasuya Got Offer In Malayalam Movie: న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు అనసూయ. జబర్ధస్త్‌తో తెలుగు...
Anasuya Got Offer In Malayalam Movie: న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు అనసూయ. జబర్ధస్త్‌తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల అనసూయ తన చలాకి మాటలతో పాటు తన అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే యాంకర్‌గా రాణిస్తున్న రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. దీంతోనే అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బడా దర్శకుల సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఇక ఈ అమ్మడి హవా కేవలం తెలుగుకే పరిమితంకాకుండా ఇతర భాషల్లోనూ మొదలైంది. ఇటీవలే తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తోన్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న అనసూయకు తాజాగా మాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు అనసూయను తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే అనసూయ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘యాత్ర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ నటన చూసే దర్శకుడు ఆమెను తీసుకోవడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనసూయ ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఖిలాడీ’తో పాటు, గోపీచంద్ నటిస్తోన్న ‘సీటిమార్’లో ఐటెం సాగంలో నటిస్తోంది.
Also Read: Pooja Hegde: సౌత్, నార్త్.. రెండు చోట్లా దుమ్ములేపుతున్న బుట్టబొమ్మ.. రెండు ఇండస్ట్రీలు తన సొంతమట