Pooja Hegde: సౌత్, నార్త్.. రెండు చోట్లా దుమ్ములేపుతున్న బుట్టబొమ్మ.. రెండు ఇండస్ట్రీలు తన సొంతమట

  సౌత్‌ నార్త్ రెండూ నావే అంటున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు ఇండస్ట్రీల మీద ఈక్వల్‌ కాన్సన్‌ట్రేషన్ చూపిస్తున్న ఈ బ్యూటీ..

Pooja Hegde: సౌత్, నార్త్.. రెండు చోట్లా దుమ్ములేపుతున్న బుట్టబొమ్మ.. రెండు ఇండస్ట్రీలు తన సొంతమట
అలాగే ఈ అమ్మడు తమిళ్ లో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. 
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2021 | 2:22 PM

Pooja Hegde:  సౌత్‌ నార్త్ రెండూ నావే అంటున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు ఇండస్ట్రీల మీద ఈక్వల్‌ కాన్సన్‌ట్రేషన్ చూపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సెటిల్మెంట్‌ విషయంలోనూ సమన్యాయం చేస్తానంటున్నారు. అందుకే రెండు ఇండస్ట్రీలు… నా సొంతమే అనిచూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో సొంత ఇల్లు కొనేసిన ఈ భామ ఇప్పుడు సౌత్‌లోనూ ఓ ఇల్లు వెతికే పనిలో ఉన్నారు.

తెలుగులో ఇప్పుడు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, ప్రభాస్‌తో రాధేశ్యామ్‌, ఆచార్యలో రామ్‌చరణ్‌ పక్కన నటిస్తున్నారు పూజా. నార్త్ లోనూ అమ్మడి అప్‌కమింగ్‌ మూవీస్‌ లైనప్‌ మామూలుగా లేదు. అందుకే ఎక్కడ స్టే చేయాల్సి వచ్చినా అన్నీ సౌకర్యాలూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రజెంట్ మూవీ సెలక్షన్‌ విషయంలో కూడా ఇదే బ్యాలెన్స్ మెయిటైన్ చేస్తున్నారు పూజా హెగ్డే. లాంగ్వేజ్‌ విషయంలోనే కాదు… స్టార్‌ డమ్‌ విషయంలో కూడా నాకు పట్టింపులు లేవంటున్నారు బుట్టబొమ్మ. పాన్ ఇండియా లెవల్లో సూపర్‌స్టార్ల తో సినిమాలు చేస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతోనూ జోడి కట్టేస్తున్నారు.

Also Read:

Ravi Krishna Navya Swamy: ప్రేమగా.. ప్రేమతో..ప్రేమ సాక్షిగా.. రవికృష్ణ, నవ్యస్వామి రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..?

Chaavu Kaburu Challaga : ‘చావు కబురు చల్లగా’ నుంచి సెకండ్ సాంగ్.. అందమైన మెలోడీతో రాబోతున్న బస్తీ బాలరాజు..