Anu Emmanuel In Love: దర్శకుడితో ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. షూటింగ్‌లో చిగురించిన ప్రేమ.?

Heroine In Love With Director: నాని హీరోగా తెరకెక్కిన 'మజ్నూ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌. ఈ సినిమాలో తన అమాయక చూపులు, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ..

Anu Emmanuel In Love: దర్శకుడితో ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. షూటింగ్‌లో చిగురించిన ప్రేమ.?
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2021 | 7:36 PM

Heroine In Love With Director: నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్నూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌. ఈ సినిమాలో తన అమాయక చూపులు, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగు కుర్రకారును ఆకట్టుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన ఈ క్యూట్‌ హీరోయిన్‌ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో బిజీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ డైరెక్టర్‌తో ప్రేమాయణంలో ఉందన్న వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆక్సిజన్’ సినిమాను తెరకెక్కించిన జ్యోతి కృష్ణనే. 2017లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అనునే కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందని. క్రమేణా.. ఆ స్నేహం ప్రేమగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఇటు అను కానీ అటు జ్యోతి కృష్ణ కానీ స్పందింలేదు. మరి ఈ జంట అందరిలా ఈ వార్తలు వట్టి పుకార్లేనని కొట్టిపారేస్తుందా.? లేదా తమ ప్రేమ నిజమేనని చెబుతుందా చూడాలి. ఇక అను సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. తాజాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసింది.

Also Read: Ravi Krishna Navya Swamy: ప్రేమగా.. ప్రేమతో..ప్రేమ సాక్షిగా.. రవికృష్ణ, నవ్యస్వామి రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..?