టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా చెలామణీ అయిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. గతేడాది విమానం, ప్రేమ విమానం వంటి ఫీల్ గుడ్ సినిమాలతో హిట్స్ కొట్టిన అనసూయ ఈ ఏడాది రజాకార్ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించింది. ఇప్పుడు ‘సింబా’ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు వస్తోంది. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. అనసూయతో పాటు కబీర్, శ్రీనాథ్ మాగంటి, వశిష్ట, దివి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 09న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా సింబా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అనసూయతో సహా చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడిన మేకర్స్ మూవీ లవర్స్ కు ఒక బంపరాఫర్ ప్రకటించారు. మొక్కలను నాటి సోషల్ మీడియాలో ఫొటోలు పంపితే.. ఈ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తానంటూ వెల్లడించారు. మొక్కలు నాటిన ఫొటోలు పంపిన వారందరికీ ఈ ఆఫర్ వర్తిసుందని స్పష్టం చేశారు.
ప్రముఖ నటుడు శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ‘ వృక్షో రక్షిత రక్షిత: అనే కాన్సెప్ట్‌తో సింబా మూవీ తెరకెక్కింది. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయని, అందరూ చూడాలి’ అని కోరాడు. ఇదే సందర్భంగా ఈ సినిమా నిర్మాత, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ సింబా మూవీ ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఉదయ భాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నాను. అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా సింబా ఉంటుంది. ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. అందరినీ మెప్పిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా గతంలోనే మొక్కలు నాటాలని, చెట్లను పెంచాలంటూ చిత్రం యూనిట్ అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మొక్కలు నాటితే తమ సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది.
సింబా సినిమాలో అనసూయ..
A supernatural thriller that will stun everyone! 🔥
Team #SIMBAA praises the concept and expresses their happiness about working on such a good movie💚#SIMBAATrailer ▶️ https://t.co/9U3I8LHgz4
In CINEMAS on August 9th, 2024😍@IamSampathNandi @iamjaggubhai @SampathNandi_TW… pic.twitter.com/Gm9ArPWGPa
— Vamsi Kaka (@vamsikaka) July 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.