Anupama Parameshwaran: అమ్మ పాటతో ఏడిపించేసిన అనుపమ.. సింగర్ చిత్ర పాడిన ఈ ఎమోషనల్ సాంగ్ విన్నారా ?..
అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బట్టర్ ఫ్లై. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి అమ్మ అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. టాలెంటెడ్ హీరో నిఖిల్ జంటగా నటించిన 18 పేజిస్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇటీవలే కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు వీరిద్దరు. ఇక ఈ సినిమా కాకుండా.. అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బట్టర్ ఫ్లై. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి అమ్మ అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
మొదటిసారిగా నిజం రూపం కనబడిందిలా.. ముసుగు తీసిన మనిషి మాటలో నాకు ఈవేళ.. అవసరమనే అదును కోసము ఎదురుచూడని మనసులేదని తెలుపుతున్నది నాకు ఈవేళ.. అమ్మా.. నీకు ఎలా చెప్పాలో ఏమో గానీ.. అమ్మా.. నీకు ఎలా చూపాలో ఈ చిత్రాన్ని.. నువ్వు ఎలా ఈదావో ఈ సంద్రాన్ని..
అంటూ సాగే ఈ పాట మనసుల్ని మెలిపెడుతుంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను కేఎస్ చిత్ర, రాహుల్ సిప్లిగంజ్ అనుపమ పరమేశ్వరన్ పాడిన ఈ సాంగ్ అందరినీ కంటతండి పెట్టించేలా ఉంది. బట్టర్ ఫ్లై చిత్రం డిసెంబర్ 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఫ్లాట్ ఫాంలో విడుదల కానుంది. ఇందులో భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా తెలుగుతోపాటు.. దక్షిణాది ప్రధాన భాషల్లో విడుదల కాబోతుంది. డైరెక్టర్ ఘంటా సతీష్ బాబు ఈసినిమాకు దర్శకత్వం వహించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.