AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organic Ginger: వార్నీ.. అల్లం పండించడం ఇంత తేలికా? మీ బాల్కనీలో ఒక చిన్న కుండీ ఉంటే చాలు!

ప్రతి వంటకంలోనూ అల్లం ఉంటే ఆ రుచే వేరు. అల్లం టీ నుండి ఘాటైన కూరల వరకు అల్లం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే, మార్కెట్లో లభించే అల్లం పైన ఒక్కోసారి రసాయనాలు కలిపే అవకాశం ఉంటుంది. అందుకే, ఎటువంటి కలుషితం లేని, స్వచ్ఛమైన ఘాటైన అల్లాన్ని మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్ పై కుండీల్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని కోసం పెద్దగా స్థలం అవసరం లేదు, కొంచెం ఓపిక సరైన పద్ధతి తెలిస్తే చాలు.

Organic Ginger: వార్నీ.. అల్లం పండించడం ఇంత తేలికా? మీ బాల్కనీలో ఒక చిన్న కుండీ ఉంటే చాలు!
How To Grow Ginger In Pots
Bhavani
|

Updated on: Feb 06, 2026 | 9:50 PM

Share

అల్లం అనేది భూమిలో అడ్డంగా పెరిగే ఒక కాండం. మనం నాటిన అల్లం దుంప నుండి మొలకలు వచ్చి, అది మొక్కగా ఎదుగుతున్న కొద్దీ భూమిలో దుంపలు విస్తరిస్తాయి. ఇంట్లో పండించే అల్లం మార్కెట్ అల్లం కంటే ఎక్కువ సువాసనను కలిగి ఉంటుంది. సరైన అల్లం దుంపను ఎంచుకోవడం నుండి పంట కోత వరకు మీరు పాటించాల్సిన దశలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

విత్తన అల్లం ఎంపిక తయారీ ఇంట్లో అల్లం నాటాలనుకున్నప్పుడు ముందుగా తాజా, బొద్దుగా ఉండి మొలకలు వచ్చే మొగ్గలు (Eyes) ఉన్న అల్లం దుంపలను ఎంచుకోవాలి. ఎండిపోయిన లేదా పాత అల్లం మొక్క సరిగ్గా పెరగదు. నాటడానికి ఒక రోజు ముందు ఈ దుంపలను 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని 2-3 అంగుళాల ముక్కలుగా కోయాలి. అయితే, ప్రతి ముక్కకు కనీసం ఒక మొలక ఉండేలా జాగ్రత్త పడాలి.

కుండీ మట్టి మిశ్రమం అల్లం దుంపలు వెడల్పుగా పెరుగుతాయి కాబట్టి, లోతు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉండే కుండీలను ఎంచుకోవాలి. తోట మట్టి, కంపోస్ట్ (సహజ ఎరువు), కోకోపీట్ కొంచెం ఇసుక కలిపిన మిశ్రమం అల్లం ఎదుగుదలకు చాలా మంచిది. కుండీలో నీరు నిల్వ ఉండకుండా కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. అల్లం ముక్కలను మట్టిలో చదునుగా ఉంచి, మొలకలు పైకి చూసేలా నాటి, పైన కొద్దిగా మట్టితో కప్పాలి. వీటిని మరీ లోతుగా పాతిపెట్టకూడదు.

సంరక్షణ కోత పద్ధతులు అల్లం మొక్కకు నేరుగా ఎండ తగలడం కంటే పాక్షిక నీడ ఉండే ప్రదేశం శ్రేయస్కరం. కుండీలోని మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి, కానీ నీరు ఎక్కువై బురదగా మారకూడదు. సుమారు 8 నుండి 10 నెలల తర్వాత అల్లం పంట కోతకు వస్తుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయంటే భూమిలో అల్లం సిద్ధమైందని అర్థం. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా, కేవలం ఇంటి వ్యర్థాలతో చేసిన కంపోస్ట్‌తో ఆరోగ్యకరమైన అల్లాన్ని పొందవచ్చు.

Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్