సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో అమలాపాల్ ఒకరు (Amala Paul). తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు దశాబ్దకాలంగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 2011.. 15 మధ్య ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది. బెజవాడ సినిమాతోనే తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో అమలాపాల్ నటించలేదు. తాజాగా ఈటైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
అమలాపాల్ మాట్లాడుతూ.. ” తెలుగు ఇండస్ట్రీకి వెళ్లగానే ఓ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉందని అర్థమైంది. కొన్ని కుటుంబాలకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఆ కుటుంబాలు మాత్రమే భిన్నమైన సినిమాలు చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటారు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు, ప్రతిదీ చాలా గ్లామరస్‌గా తెరకెక్కిస్తారు. అలాగే కమర్షియల్ చిత్రాలు మాత్రమే. అందుకే నేను తెలుగు పరిశ్రమతో ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయాను. ” అంటూ చెప్పుకొచ్చింది.
తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆడిషన్స్, మీటింగ్స్ అంటూ సంవత్సరంపాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత రెండు సినిమాలు చేశాను. కానీ అవి విడుదల కాలేదు. మూడవ సినిమా మైనా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాను. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది అమలాపాల్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.