అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం నేరమా?- అమలాపాల్

చెన్నై: తను ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేముందని కథానాయిక అమలాపాల్‌ అంటున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘ఆమె’. రత్న కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా కోసం అమలాపాల్ నగ్నంగా నటించింది.  ఈ నెల 19న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా ట్రైలర్‌లో అమలాపాల్‌ తన సహనటి ఆర్జే రమ్యను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ముద్దు సన్నివేశం గురించి మీడియా తాజాగా అమలాపాల్‌ను ప్రశ్నించింది. దీనికి […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:19 am, Thu, 18 July 19
అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం నేరమా?- అమలాపాల్

చెన్నై: తను ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేముందని కథానాయిక అమలాపాల్‌ అంటున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘ఆమె’. రత్న కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా కోసం అమలాపాల్ నగ్నంగా నటించింది.  ఈ నెల 19న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా ట్రైలర్‌లో అమలాపాల్‌ తన సహనటి ఆర్జే రమ్యను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ముద్దు సన్నివేశం గురించి మీడియా తాజాగా అమలాపాల్‌ను ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేంటి? ఆ షాట్‌ అనుకోకుండా వచ్చింది, అది స్క్రిప్టులో లేదు. ఓసారి పాత్రలో లీనమైతే.. ఇక మన స్వభావాన్ని పక్కన పెట్టినట్లే. ఈ చిత్రం శృంగారం నేపథ్యంలో సాగేది కాదు. ఈ సినిమా కంటెంట్‌ అర్థం చేసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే’ అని ఆమె అన్నారు.