తల్లి కాబోతున్న హీరోయిన్ శృతి

శృతి హరిహరన్.. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని నటి. కానీ ఈమె పేరు మాత్రం ఈ ఏడాది హైడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. దానికి రీజన్ మీటు మూవ్‌మెంట్. ప్రముఖ దక్షిణాది హీరో అర్జున్ తనను వేధింపులకు గురి చేశాడంటూ బయటపెట్టి సంచలనం సృష్టించింది శృతి. కన్నడంలో పాపులర్ అయిన శృతి హరిహరన్ మొన్నటి వరకు తనకు వివాహానికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటపెట్టుకోలేదు. తనకు పెళ్లి కాలేదన్నట్టుగానే ప్రవర్తించింది. అయితే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తాను గర్భవతినంటూ […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:25 am, Thu, 18 July 19
తల్లి కాబోతున్న హీరోయిన్  శృతి

శృతి హరిహరన్.. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని నటి. కానీ ఈమె పేరు మాత్రం ఈ ఏడాది హైడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. దానికి రీజన్ మీటు మూవ్‌మెంట్. ప్రముఖ దక్షిణాది హీరో అర్జున్ తనను వేధింపులకు గురి చేశాడంటూ బయటపెట్టి సంచలనం సృష్టించింది శృతి.

కన్నడంలో పాపులర్ అయిన శృతి హరిహరన్ మొన్నటి వరకు తనకు వివాహానికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటపెట్టుకోలేదు. తనకు పెళ్లి కాలేదన్నట్టుగానే ప్రవర్తించింది. అయితే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తాను గర్భవతినంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోని అప్‌డేట్ చేసింది. హీర్ అర్జున్‌పై ఆరోపణలు చేసినప్పుడు ఆమె పెళ్లి విషయాన్ని దాచిపెట్టిందనే వార్తలు వచ్చాయి. అర్జున్ కూడా తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అయితే అప్పుడు శృతి హరిహరన్.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేసింది. తన మారిటల్ స్టేటస్‌కి అర్జున్ చేసిన లైంగిక వేధింపులకు సంబంధం ఏమిటని కూడా ప్రశ్నించింది.

రామ్‌కుమార్ అనే వర్థమాన నటుడ్ని ఆమె రీసెంట్‌గా వివాహమాడిందట. రామ్,శృతి ఇద్దరూ ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జంటగా ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేయలేదు. కానీ సడెన్‌గా తన భర్త రామ్ కిలారీ అని, తాను తల్లిని కాబోతున్నాను అని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ఫోటో  పోస్ట్ చేసింది.