ఇప్పుడు దేశ వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియానే కనిపిస్తోంది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన అల్లు అర్జున్ (Allu Arjun).. అనుకున్నది సాధించి చూపించారు. బిగ్గెస్ట్ హిట్ పక్కా అన్న కాన్ఫిడెన్స్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప 2 (Pushpa 2) అదే రేంజ్ లో పర్ఫామ్ చేస్తోంది. కేవలం 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ సినిమా మరిన్ని రికార్డులు టార్గెట్ చేస్తోంది. దీంతో పుష్పరాజ్ ఫైనల్ టార్గెట్ ఏంటన్న విషయం మీదే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న బిగ్గెస్ట్ కలెక్షన్ రికార్డ్ బాహుబలి 2 మూవీదే. నెంబర్ పరంగా దంగల్ కాస్త ముందున్న అది సింగిల్ రిలీజ్‌లో సాధించిన మొత్తం కాదు. అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా బాహుబలి 2దే అగ్రస్థానం. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అప్పటి వరకు ఇండియా సినిమా ఊహించిన స్థాయికి చేరింది బాహుబలి 2. ఈ సక్సెస్ తరువాత అన్ని ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా మూవీస్ తెర మీదకు వచ్చాయి.
బాహుబలి బాటలో చాలా మంది బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. కానీ వసూళ్ల పరంగా మాత్రం బాహుబలి 2 రేంజ్ ను అందుకోలేకపోయారు. దీంతో ఏడుళ్లుగా ఇండియాస్ హయ్యస్ట్ గ్రాసర్ అన్న రికార్డ్ బాహుబలి 2 పేరిటే ఉంది. ఆ తరువాత భారీ విజయం సాధించిన సినిమాల రికార్డ్‌లన్నింటినీ నాన్ బాహుబలి రికార్డులుగానే పరిగణిస్తున్నారు. ఫైనల్ గా బాహుబలి 2 రికార్డ్ లను తిరగరాసే సత్తా ఉన్న సినిమాగా పుష్ప 2ను చూస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.
పుష్ప 2తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు అల్లు అర్జున్. డే వన్ నుంచే వసూళ్ల రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 ఆల్రెడీ తొలి వారం అన్ని రికార్డులను తిరగరాసింది. ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేసింది. దీంతో ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తుందా అన్న డిస్కషన్ జరుగుతోంది. ఆ అవకాశం కూడా చాలా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
బాహుబలి రిలీజ్ టైమ్ లో ఉన్న టికెట్ రేట్స్ తో పోల్చుకుంటే పుష్ప 2 విషయంలో ఉన్న టికెట్ రేట్స్ చాలా ఎక్కువ. సో వసూళ్ల పరంగా అది పుష్ప2కి హెల్ప్ అవుతుంది. నార్త్ లో పుష్ప క్రేజ్ కూడా ఈ సినిమాను రూ.1800 కోట్ల మార్క్ ను దాటిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు మాలీవుడ్ లోనూ బన్నీకి సాలిడ్ బేస్ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే అతి త్వరలో పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని లెక్కలేస్తున్నారు.