Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్.. డిసెంబర్ మూమెంట్స్ అంటూ..
డిసెంబర్ 4న, హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్‌కి అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, వారి పిల్లలతో వెళ్లారు. థియేటర్ దగ్గర ఉన్న అభిమానులు అల్లు అర్జున్ ను ఒక్కసారిగా ఎగబడ్డారు, దీనితో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది అలాగే ఆమె చిన్న కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను హాస్పటల్ లో ఉన్నాడు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఇండియాను షేక్ చేస్తుంది. భారీ కలెక్షన్స్ తో ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా దూసుకుపోతుంది పుష్ప 2 ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. రీసెంట్ గా బాహుబలి 2 రికార్స్డ్ కూడా దాటేసింది పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో మెప్పించారు. 2020లో వచ్చిన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. ఇక పుష్ప 2 సినిమా ఇప్పుడు దంగల్ సినిమా రికార్డ్స్ పై కన్నేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కాగా రీసెంట్ గా అల్లు అర్జున్ పోలీస్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే.
పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ 11గా ఉన్నారు అల్లు అర్జున్. ఈ కేసులో ఇటీవలే జైలుకు కూడా వెళ్లారు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ సమస్య దాదాపు ముగిసింది. అయితే తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యామిలీ ఫోటోలను నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా స్నేహ రెడ్డి అల్లు అర్జున్, తన పిల్లల ఫోటోలను పంచుకున్నారు. అల్లు అర్జున్ తన పిల్లలతో సరదాగా గడిపిన క్షణాలు షేర్ చేస్తూ.. డిసెంబర్ మెమొరీస్ అంటూ ఈ ఫోటోలను పంచుకున్న స్నేహ. కాగా చివరిగా ఆమె షేర్ చేసిన సెల్ఫీ ఫోటో విశేషంగా ఆకట్టుకుంది. ఆమె మెడలోని లాకెట్ అల్లు అర్జున్ సైన్ AA గా ఉండటం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోల పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .