Allu Arjun: ఇది బన్నీ స్టైల్.. ఈవెంట్లో పనేరై వాచ్ ధరించిన అల్లు అర్జున్.. ధరెంత ఉంటుందో తెలుసా.. ?
అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. పుష్ప2 పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో స్టైలీష్, ఫ్యాషన్ సెన్స్‌కు అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్. అద్భుతమైన నటనతో వెండితెరపై అలరిస్తూ.. తనదైన మ్యానరిజంతో యూత్ ఫేవరేట్ ఐకాన్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. గంగోత్రి సినిమాతో హీరోగా సినీ ప్రయాణం ఆరంభించిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పింది పుష్ప మూవీ. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. పుష్ప2 పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో స్టైలీష్, ఫ్యాషన్ సెన్స్‌కు అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్. అద్భుతమైన నటనతో వెండితెరపై అలరిస్తూ.. తనదైన మ్యానరిజంతో యూత్ ఫేవరేట్ ఐకాన్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.
ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఇటీవల టాలీవుడ్ దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సింపుల్, స్టైలీష్ గా కనిపించారు బన్నీ. ముఖ్యంగా ఈ వేడుకలో బన్నీ ధరించిన పనేరై వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సెలబ్రేటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ ఇన్ స్టా పేజీ ప్రకారం బన్నీ ధరించిన పనైరా వాచ్ ధర రూ. 3,97,431 అని తెలుస్తోంది. ఇది వాచ్ ల పట్ల బన్నీకి ఉన్న ఆసక్తిని చూపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన అల్లు అర్జున్ స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
