Pushpa 2: బాక్సాఫీస్ దిమ్మ తిరిగేలా పుష్ప 2 కలెక్షన్లు.. అల్లు అర్జున్ సినిమాకు మొదటి రోజే ఎన్నికోట్లు రావొచ్చంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప2: ది రూల్' సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Pushpa 2: బాక్సాఫీస్ దిమ్మ తిరిగేలా పుష్ప 2 కలెక్షన్లు.. అల్లు అర్జున్ సినిమాకు మొదటి రోజే ఎన్నికోట్లు రావొచ్చంటే?
Pushpa 2
Follow us
Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: Nov 08, 2024 | 5:32 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ఫ2. సుమారు మూడేళ్ల క్రితం సైలెంట్ గా విడుదలై సంచలనాలు సృష్టించిన పుష్ఫ సినిమాకు సీక్వెల్ ఇది. మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ సీక్వెల్ ను తెరకెక్కించారు. డిసెంబర్ ఈ పాన్ ఇండియా మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో పుష్ఫ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ క్రేజీ సీక్వెల్ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ.270 కోట్ల వసూళ్లు రాబట్టుతుందని బాక్సాఫీస్ పండితులు లెక్కలు వేస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్‌ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ . ‘పుష్ప2 : రూల్’ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేసింది. ఈ సినిమా ఇండియాలో 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, విదేశాల నుండి 70 కోట్ల రూపాయలు ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలా చేస్తే పుష్ఫ 2 రోజు మొదటి రోజు వసూళ్లు 270 కోట్ల రూపాయల దాటుతాయంటోంది.

భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయనే సమాచారం సాక్నిక్‌ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 85 కోట్లు, కర్ణాటక నుంచి 20 కోట్లు, తమిళనాడు రాష్ట్రం నుంచి 12 కోట్లు, కేరళ నుంచి 8 కోట్ల రూపాయలు వస్తాయట. ఇక ఇండియాలోని మిగతా ప్రాంతాల నుంచి 75 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేసింది. టోటల్ గా ఇండియాలో ఈ మూవీ 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నివేదించింది.

ఇవి కూడా చదవండి

‘పుష్ప’ సినిమా మొత్తం 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ‘పుష్ప 2’ చిత్రం రెండు రోజుల్లో ఈ వసూళ్లను చేరుకోనుందని సాక్నిక్ నివేదించింది. విదేశాల్లోనూ ‘పుష్ప 2’ సినిమాపై హైప్ క్రియేట్ కావడంతో తొలిరోజే హిట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.