Allu Arjun: ‘నా అభిమానులకు అంకితం’.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై అల్లు అర్జున్ ఎమోషనల్

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో నటననకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది. ఇక గతేడాది రిలీజైన పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది.

Allu Arjun: నా అభిమానులకు అంకితం.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై అల్లు అర్జున్ ఎమోషనల్
Allu Arjun

Updated on: Nov 02, 2025 | 4:51 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో అల్లు అర్జున్   మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.   ఈ సందర్బంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘ఇంతటి అద్భుతమైన గౌరవం ఇచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీకి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇతర విభాగాల విజేతలకు నా హృదయపూర్వక అభినందనలు. నిరంతర నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు… ఈ అవార్డును నా అభిమానులకు వినయంగా అంకితం చేస్తున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బన్నీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ది గార్దియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.