
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ.. కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లినట్లుగా సమాచారం. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేస్తూ లండన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక అందులో బ్లాక్ సూట్ లో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ. అయితే అల్లు అర్జున్ లండన్ వెళ్లింది తన సతీమణి స్నేహా రెడ్డి బర్త్ డే సెలబ్రెషన్స్ కోసమని క్లారిటీ వచ్చేసింది. ఈరోజు (సెప్టెంబర్ 29న) అల్లు స్నేహరెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తన భార్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ సర్ ప్రైజ్ వీడియో షేర్ చేశారు బన్నీ.
ఇంట్లో ఉన్నప్పుడు.. బయటకు వెళ్లినప్పుడు తన మొబైల్లో స్నేహారెడ్డిని అందంగా బంధించాడు బన్నీ. ఇంట్లో సరదాగా మాట్లాడుతూనే వీడియో తీశారు.. అలాగే బయటకు వెళ్లినప్పుడు స్నేహాకు తెలియకుండానే కొన్నిసార్లు వీడియోస్ తీసి.. వాటన్నింటిని జత చేసి ఇప్పుడు ఒక వీడియోగా ఎడిట్ చేసి హ్యాప్పీ బర్త్ డే క్యూటీ అంటూ తన ఇన్ స్టాలో షేర్ చేశారు బన్నీ. నా జీవితానికి వెలుగువి నువ్వే అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా…స్నేహాకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు నెటిజన్స్.
ఇక తన భార్య బర్త్ డేను సెలబ్రేట్ చేసేందుకు బన్నీ పుష్ప 2 చిత్రీకరణ నుంచి బ్రేక్ తీసుకుని లండన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస బన్నీ, స్నేహా ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక బన్నీ ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. కొడుకు అయాన్, కూతురు అర్హతో కలిసి బన్నీ చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే డాటర్స్ డే సందర్భంగా అర్హతో సరదాగా ఆడుతున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు బన్నీ.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ నటిస్తోన్న పుష్ప 2 చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మరింత హైప్ పెంచేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.