
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప(Pushpa)గా థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు ఆలు అర్జున్ పేరు దేశాలు దాటి వినిపిస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప పాటలే.. పుష్ప డైలాగులే.. అంతలా జనాల్లోకి దూసుకెళ్లింది ఈ సినిమా. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కావాల్సినంత టైమ్ కేటాయిస్తూ ఉంటాడు. వీలు చిక్కినప్పుడల్లా.. పిల్లలతో కలిసి సరదాగా గడుపుతుంటాడు. గతంలో తన ముద్దుల కూతురు అర్హ (Allu Arha )తో కలిసి అల్లరి చేస్తూ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. అలాగే అల్లు అర్జున్ సతీమణి కూడా అల్లు అర్హ, అయాన్ లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా అల్లు అర్హ తన తండ్రికి ఓ లవ్లీ వెల్కమ్ చెప్పింది. పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ. ఈ మూవీ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఆందాలను ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు బన్నీ. దాదాపు 16 రోజుల తర్వాత రీసెంట్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బన్నీకి ఆర్ష స్వీట్ వెల్కమ్ చెప్పింది. ఆకులు గులాబీ పూల రెక్కలతో `వెల్కమ్ నాన్న` అని రాసి బన్నీకి ఇంట్లోకి వెల్కమ్ చెప్పింది అర్హ. బన్నీ ఈ ఫొటోని సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోకి `పదహారు రోజుల తరువాత స్వీటెస్ట్ వెల్కమ్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :