Pushpa 2 Trailer: అల్లు అర్జున్ అరాచకం సామీ.. దుమ్మురేపిన పుష్ప 2 ట్రైలర్

|

Nov 17, 2024 | 6:04 PM

అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు దర్శకుడు సుకుమార్. బన్నీ చెప్పే డైలాగ్స్ , యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్ అండ్ యాక్షన్..

Pushpa 2 Trailer: అల్లు అర్జున్ అరాచకం సామీ.. దుమ్మురేపిన పుష్ప 2 ట్రైలర్
బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్..బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ బెల్ట్ లో సైతం పుష్ప ది రైజ్ కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప ది రూల్‌పై..భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో పార్ట్‌-2ను రూపొందించారు..మేకర్స్‌. ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. మొదటి నుంచి ఊహించనట్టే ఈ ట్రైలర్ దుమ్మురేపింది. అబ్బబ్బా.. అల్లు అర్జున్ అరాచకం సామీ.. అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. పుష్ప 2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు దర్శకుడు సుకుమార్. బన్నీ చెప్పే డైలాగ్స్ , యాక్షన్స్ సీన్స్, దేవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , ఫహద్ లుక్ అండ్ యాక్షన్ అబ్బో ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపినించేలా చేసింది.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రానుంది. తొలి భాగంలో అల్లు అర్జున్ కూలీ నుంచి సిండికేట్ పాట్నర్ గా ఎదిగిన విధానాన్ని చూపించారు ఇక ఇప్పుడు పుష్ప2లో సిండికేట్ కు కింగ్ గా మారిన పుష్ప రాజ్ ను చూపించనున్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ అలాగే ధనంజయ, జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు నటించారు. పుష్ప 2 షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్ని సినిమా పై హైప్ ను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని ప్రేక్షకులు ముఖ్యంగా బన్నీ ఆర్మీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో విడుదల చేశారు. భారీగా హాజరైన అభిమానుల మధ్య ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు మూవీ టీమ్. అల్లు అర్జున్ కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప 2 ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?