Allu Arjun : ఇట్స్ అఫీషియల్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‏తో అల్లు అర్జున్.. అంచనాలు పెంచేసిన గ్లింప్స్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలపై ఇప్పుడు భారీగానే అంచనాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. పుష్ప 1, 2 తర్వాత బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు బన్నీ.

Allu Arjun : ఇట్స్ అఫీషియల్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‏తో అల్లు అర్జున్.. అంచనాలు పెంచేసిన గ్లింప్స్..
Allu Arjun

Updated on: Jan 14, 2026 | 5:37 PM

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ హైప్ మధ్య రూపొందిస్తున్న ఈ మూవీలో దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశారు బన్నీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ప్రస్తుతం లోకేష్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమాకు AA23 వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబో గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముందే నుంచే ఈ ప్రాజెక్ట్ పై హైప్ నెలకొంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ప్రతిసారీ విభిన్న కంటెంట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించారు. ఇటీవలే రజినీకాంత్, నాగార్జునతో కలిసి కూలీ సినిమాను రూపొందించారు. ఇప్పుడు బన్నీతో కలిసి బ్లాక్ బస్టర్ రెడీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..