Allu Arjun : అందుకే బన్నీని స్టైల్‌కా బాప్ అనేది.. దుమ్మురేపుతోన్న ఐకాన్ స్టార్ న్యూ లుక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun )స్టైల్ కి ఫిదా కానీ వారంటూ ఉండరేమో.. బన్నీ మొదటినుంచి యుత్ ఐకాన్ అనే చెప్పాలి. బన్నీ డ్రసింగ్, హెయిర్ స్టైల్ ఇలా అన్నింటిలో సూపర్ స్టైల్ తో స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun )స్టైల్ కి ఫిదా కానీ వారంటూ ఉండరేమో.. బన్నీ మొదటి సినిమా నుంచే యుత్ ఐకాన్ అనే చెప్పాలి. బన్నీ డ్రసింగ్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నింటిలో సూపర్ స్టైల్ తో స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీ సినిమాల్లోని లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమా సినిమాకు ఆయన మెకోవర్స్ ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేస్తుంటాయి. రీసెంట్ గా పుష్ప సినిమాలో ఊర మాస్ లుక్ లోనూ అదరగొట్టిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2 కోసం రెడీ అవుతున్నారు. అయితే బన్నీ ఈ సినిమా కంటే ముందు ఓ యాడ్ లో నటించనున్నారు. ఈ యాడ్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
గతంలోనూ బన్నీ సుకుమార్ తో కలిసి ఓ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ తో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేయనున్నారు. ఈ యాడ్ కోసం బన్నీ మరో సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బన్నీ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. లైట్ గా నెరిసిన గడ్డం, రింగులు తిరిగిన జుత్తు, నోట్లో సిగార్, చెవికి పోగుతో ఓ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నాడు బన్నీ. ఈ యాడ్ లో గురూజీ బన్నీని కాస్త ఏజ్డ్ గా కనిపించనున్నాడని ఈ ఫోటో చూస్తుంటే అర్ధమవుతుంది. ఏదిఏమైనా బన్నీ లుక్ మాత్రం కిరాక్. ఈ ఫోటో పై నెటిజన్లు, బన్నీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్టైల్ కా బాప్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ ఫోటో చూస్తే మీరూ అదే మాట అంటారు.
View this post on Instagram