
ఐకాన్‌స్టార్, అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో కోసం భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూశారు. ఈ సన్సేషనల్ కాంబినేషన్ సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ ఫస్ట్ తెలుగు సినిమా ఇది.ఇండియన్ సినిమా పరిశ్రమనలొ నూతన ఉత్తేజాన్ని నింపిన ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ అనౌన్స్‌మెంట్‌ను చేసి అందరిని సంభ్రమశ్చర్యాలకు గురిచేసింది. అయితే ఇప్పటివరకు టైటిల్ ఖరారు కాని ఈ పాన్-ఇండియా చిత్రంతో ముగ్గురు స్టార్స్ ఏకమవుతున్నారు. వారిలో ఒకరు భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీ (జవాన్, థెరి, బిగిల్, మెర్సల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు), ఇంకొకరు పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పురస్కారం పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక మూడవ వ్యక్తి భారతదేశంలోని అగ్రగణ్య మీడియా సంస్థలలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌కు చెందిన సన్ పిక్చర్స్. కాగా గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది.
ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఐకాన్‌స్టార్‌ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ A22 x A6గా పిలవబడుతున్న ఈ చిత్రం, భారతీయ విలువలతో కూడిన కథనంతో కూడిన ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగించేలా రూపొందించనున్న ఈ సినిమా, భావోద్వేగాలు, మాస్ యాక్షన్, పెద్ద స్కేలు నిర్మాణంతో ఓ చారిత్రక సినిమాగా నిలవనుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేక వీడియో చూసిన అందరూ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ మ్యాజిక్ జరగబోతుందని, ఈ చిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉండబోతుందని అర్థమవుతోంది. సంచలన దర్శకుడు అట్లీ తొలిసారిగా తెలుగులో రూపొందిస్తున్న అంతర్ధాతీయ పాన్ ఇండియా సినిమా ఇది. నటీనటులు, సాంకేతిక బృందం, విడుదల తేదీ వంటి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
Magic with mass & a world beyond imagination! #AA22
Teaming up with @Atlee_dir garu for something truly spectacular with the unparalleled support of @sunpictures pic.twitter.com/mTK01BVpfE
— Allu Arjun (@alluarjun) April 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.