
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన తనయ అల్లు అర్హకు కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉంది. ఈ చిన్నారి తన అల్లరితో ముద్దుముద్దు మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అర్హ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ అల్లరి పిల్ల సినిమాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నశాకుంతలం సినిమాలో అర్హ నటిస్తుంది. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం అర్హను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో అల్లు అర్హ జాయిన్ అయ్యింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Kajol: స్టార్ హీరోయిన్ అయితే ఇంత పొగరా ? కాజోల్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు…
MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్.. అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..
Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..