Pushpa 2: ఇది సార్ పుష్పగాడి రేంజ్..! దేశవ్యాప్తంగా దుమ్మురేపుతోన్న అల్లు అర్జున్ అభిమానులు
అల్లు అర్జున్ పుష్ప 2 సందడి దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ చిత్రం డిసెంబర్ 5 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు వాయిదా పడడం ఈ సినిమా విశేషమే. అయితే ఇప్పుడు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు విడుదలకు ముందే ఈ సినిమా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా విడుదల కోసంఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ ఈసారి భారీగానే ప్లాన్ చేశాడు. పుష్ప సినిమా విడుదలకు ముందు ప్రతి సన్నివేశాన్ని సీరియస్‌గా వర్క్ చేశారు. సినిమాలోని కొన్ని భాగాలను రీ షూట్ కూడా చేశారు. సినిమా విడుదలకు ఇంకా దాదాపు 40 రోజుల సమయం ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా అదరగొట్టిన ఈ సినిమా భారీ విజయంతో పాటు కలెక్షన్స్ పరంగాను నయా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం విశేషమేమిటంటే, ఈ సినిమా ఒకే రోజు 6 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా మొత్తం 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు. పుష్ప2 సినిమా భారతదేశంలో 6000 స్క్రీన్లలో విడుదల కానుంది. అంతే కాకుండా విదేశాల్లో కూడా 5500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప 2 సినిమా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా బీహార్ లో ఓ అభిమాని పుష్ప రాజ్ సైతిక శిల్పాన్ని చేశారు. గతంలో చాలామంది ప్రముఖుల సైతిక శిల్పాలను ఏర్పాటు చేశారు. తాజాగా బీహార్ లో ఓ అభిమాని ఇలా అల్లు అర్జున్ సైతిక శిల్పాన్ని చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని పై అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోను బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని కామెంట్స్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.